శుక్రవారం 05 జూన్ 2020
National - May 23, 2020 , 15:29:43

25 నుంచి షిర్డీ - హైదరాబాద్‌ మధ్య ఇండిగో విమానం

25 నుంచి షిర్డీ - హైదరాబాద్‌ మధ్య ఇండిగో విమానం

హైదరాబాద్‌ : ఈ నెల 25వ తేదీ నుంచి షిర్డీ - హైదరాబాద్‌ మధ్య ఇండిగో విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో షిర్డీకి విమానం ప్రయాణం కోసం టికెట్‌ బుకింగ్‌ మొదలైంది.

కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ కారణంగా దేశీయ, విదేశీ విమాన సర్వీసులను భారత విమానయాన శాఖ నిలిపి వేసిన విషయం విదితమే. అయితే లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా దేశీయ విమానాలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. మే 25వ తేదీ నుంచి దేశీయ విమానాలను తిరిగి ప్రారంభించుకోవచ్చుని కేంద్రం ప్రకటన విడుదల చేసింది. మొత్తం 3 నెలల పాటు ప్రతి వారం 8428 విమానాలు నడుస్తాయని తెలిపారు. మే 25 నుంచి ఆగస్టు 25 వరకు ఈ విధానాన్ని పాటించనున్నారు. 

డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) అన్ని ప్రముఖ భారతీయ విమానయాన సంస్థల ప్రతినిధులతో మే 21న సమావేశం నిర్వహించి.. దేశీయ విమాన ప్రయాణాలకు సంబంధించి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దేశీయ విమాన ప్రయాణాలకు కీలకమైన మార్గదర్శకాలు జారీ చేశారు. కరోనా వైరస్‌ సోకిన వారు విమానాల్లో ప్రయాణించరాదు. కంటైన్‌మెంట్‌ జోన్లలో ఉన్న వారికి ప్రయాణానికి అనుమతి నిరాకరించారు. మాస్కులు, గ్లవ్స్‌ తప్పనిసరిగా ధరించాలి. 


logo