శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
National - Jan 17, 2021 , 14:58:51

ఇండిగో విమానం అత్య‌వ‌స‌ర ల్యాండింగ్‌

ఇండిగో విమానం అత్య‌వ‌స‌ర ల్యాండింగ్‌

భోపాల్‌: ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం ఇవాళ భోపాల్‌లో అత్య‌వ‌స‌రంగా ల్యాండ్ అయ్యింది. సూర‌త్ నుంచి కోల్‌క‌తాకు వెళ్తున్న విమానంంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో భోపాల్‌కు మళ్లించి విమానాశ్రయంలో దించినట్టు అధికారులు తెలిపారు. సూరత్ నుంచి విమానం బయలుదేరిన కాసేప‌టికే ఫ్లైట్‌లో సాంకేతిక సమస్యలను సిబ్బంది గుర్తించార‌ని, అందుకే స‌మీపంలోని భోపాల్‌కు మ‌ళ్లించి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేసిన‌ట్లు వెల్ల‌డించారు. ఎమ‌ర్జెన్సీగా ల్యాండ్ అయిన విమానంలో 172 మంది ప్ర‌యాణికులు ఉన్నార‌ని, వారిలో ఎవ‌రికీ ఎలాంటి అపాయం జ‌రుగ‌లేద‌ని అధికారులు తెలిపారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo