బుధవారం 28 అక్టోబర్ 2020
National - Sep 28, 2020 , 13:26:15

దేశంలో 50 ల‌క్ష‌లు దాటిన క‌రోనా రిక‌వ‌రీలు

దేశంలో 50 ల‌క్ష‌లు దాటిన క‌రోనా రిక‌వ‌రీలు

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా వైర‌స్ కేసులు ప్ర‌తిరోజు అత్య‌ధిక సంఖ్య‌లో న‌మోద‌వుతున్న‌ప్ప‌టికీ, అంత‌కంటే ఎక్కువ‌గా బాధితులు కోలుకుంటున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా బారిన‌ప‌డిన‌వారిలో 50 ల‌క్ష‌లకు పైగా బాధితులు కోలుకున్నారు. గ‌త 11 రోజుల్లో 10 ల‌క్ష‌ల మంది క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డ్డార‌ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌శాఖ ప్ర‌క‌టించింది. ప్ర‌భుత్వ గ‌ణాంకాల ప్ర‌కారం గ‌త 24 గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా 74,893 మంది కోలుకున్నార‌ని వెల్ల‌డించింది. దీంతో క‌రోనాను జ‌యించిన‌వారి సంఖ్య 50,16,520కి చేరింద‌ని తెలిపింది. దేశంలో గ‌త కొన్నిరోజులుగా ప్ర‌తిరోజు పెద్ద‌మొత్తంలో అంటే 90 వేల‌కుపైగా బాధితులు మ‌హ‌మ్మారి బారినుంచి బ‌య‌ట‌ప‌డుతున్నారని పేర్కొంది. 


దేశంలో జూన్ 3 నాటికి క‌రోనా నుంచి కోలుకున్న‌వారి సంఖ్య ల‌క్ష‌కు చేరింద‌ని, ఇప్పుడు అది 50 ల‌క్ష‌లు దాటింద‌ని ప్ర‌క‌టించింది. దీంతో యాక్టివ్ కేసులకంటే రిక‌వ‌ర్డ్ కేసుల సంఖ్య మూడింత‌లు అధికంగా ఉంద‌ని పేర్కొంది. సెప్టెంబ‌ర్ 27న కొత్త‌గా 92,043 మంది కోలుకున్నార‌ని, ఇందులో 76 శాతం మంది ప‌ది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే ఉన్నార‌ని తెలిపింది. 


logo