గురువారం 29 అక్టోబర్ 2020
National - Sep 23, 2020 , 08:39:17

దేశంలో 12 ల‌క్ష‌లు దాటిన క‌రోనా ప‌రీక్ష‌ల సామ‌ర్థ్యం

దేశంలో 12 ల‌క్ష‌లు దాటిన క‌రోనా ప‌రీక్ష‌ల సామ‌ర్థ్యం

న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ క‌రోనా ప‌రీక్ష‌ల సామర్ధ్యం 12 ల‌క్ష‌లు దాటింద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశ‌వ్యాప్తంగా నిన్న‌టివ‌ర‌కు 6.5 కోట్ల మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని వెల్ల‌డించింది. ప్ర‌తిరోజు అత్య‌ధిక సంఖ్య‌లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం వ‌ల్ల క‌రోనా పాజిటివ్‌ల‌ను తొంద‌ర‌గా గుర్తించ‌డం ద్వారా వైర‌స్ మ‌రొక‌రికి వ్యాప్తిచెంద‌కుండా నివారించ‌గ‌లుగుతున్నామ‌ని పేర్కొంది. 

కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిప్రాంతాల్లో జాతీయ స‌గ‌టు కంటే అత్య‌ధికంగా క‌‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తాన్నార‌ని, పాజిటివ్ రేట్‌కూడా త‌క్కువ‌గా ఉంద‌ని వెల్ల‌డించింది. మిజోరం, మ‌ణిపూర్‌, అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌, గుజ‌రాత్‌, సిక్కిం, త్రిపుర‌, జ‌మ్ముక‌శ్మీర్‌, ఒడిశా, అసొం, పంజాబ్‌, ఉత్త‌రాఖండ్‌లో జాతీయ స‌గ‌టు కంటే అత్య‌ధికంగా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నార‌ని, తక్కువ పాజిటివ్ రేట్ ఉన్న‌ద‌ని తెలిపింది.

దేశంలో నిన్న 75,083 పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా, మొత్తం కేసులు 55,62,664 దాటాయి. ఇందులో 44,97,868 మంది కోలుకోగా, మ‌రో 9,75,861 మంది చికిత్స పొందుతున్నారు.