బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 23, 2020 , 16:37:04

తమిళనాడులో రెండో జాతీయస్థాయి ప్లాస్మాబ్యాంకు ప్రారంభం

తమిళనాడులో రెండో జాతీయస్థాయి ప్లాస్మాబ్యాంకు ప్రారంభం

చెన్నై: దేశ రాజధాని ఢిల్లీ తర్వాత తమిళనాడు రాష్ట్రంలో రెండో జాతీయస్థాయి ప్లాస్మా బ్యాంకు ప్రారంభమైంది.  రూ. 2.34 కోట్ల వ్యయంతో దీన్ని ఏర్పాటు చేసినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విజయ్ భాస్కర్ గురువారం ఒకట ప్రకటనలో తెలిపారు. ‘మేం ఇంతకుముందు ప్లాస్మా పద్ధతిని ట్రయల్ ప్రాతిపదికన నిర్వహించాం. మధురైలో నలుగురికి విజయవంతంగా ప్లాస్మా థెరపీ అందించాం. ఇప్పుడు మాకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆమోదం లభించింది.  దీంతో జాతీయ స్థాయిలో 2.34 కోట్ల రూపాయలతో ప్లాస్మా బ్యాంకును ప్రారంభించాం. వివిధ జిల్లాల్లో మరికొన్నింటిని కూడా ఏర్పాటు చేస్తాం.’ అని ఆయన వెల్లడించారు. 

కొవిడ్‌ నుంచి కోలుకున్నవారు డిశ్చార్జి అయిన 14రోజుల తర్వాత ప్లాస్మాను దానం చేయవచ్చని విజయ్‌ భాస్కర్‌ తెలిపారు.  ప్లాస్మాను రక్తం నుంచి వేరుచేస్తారని,  దీనిని ఒక ఏడాదిపాటు నిల్వ చేసి వాడవచ్చని వివరించారు. అలాగే, కొవిడ్‌ మరణాలపై చర్చించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2 మిలియన్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పరీక్షల పరంగా ముందున్నామని పేర్కొన్నారు.  


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo