శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 17, 2020 , 22:13:30

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌కు త‌గ్గిన డిమాండ్‌

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌కు త‌గ్గిన డిమాండ్‌

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్‌కు డిమాండ్ భారీగా ప‌డిపోయింది. ప‌లు న‌గ‌రాల్లో తిరిగి లాక్‌డౌన్ విధించడం, పెరుగుతున్న ధరల వంటి కారణాల‌తో ఈ నెల మొదటి అర్ధభాగంలో పెట్రోలు, డీజిల్‌కు డిమాండ్ త‌గ్గింది. ఇక‌ గత నెల ఇదే సమయంతో పోలిస్తే కూడా డిమాండ్ బాగా తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి. చమురు దిగుమతి, వినియోగంలో భారత్‌ది ప్రపంచంలోనే మూడో స్థానం కాగా, లాక్‌డౌన్ అమల్లో ఉన్న ఏప్రిల్‌లో పెట్రో అమ్మకాలు రికార్డు స్థాయిలో పడిపోయాయి. 

జూలై తొలి అర్ధ భాగంలో డీజిల్ అమ్మకాలు 18 శాతానికి పడిపోయి 2.2 మిలియన్ టన్నుల అమ్మ‌కాలు మాత్రమే జరిగాయి. జూన్‌లో ఇదే సమయంలో దాదాపు 21 శాతం డీజిల్ విక్రయాలు జరిగినట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గణాంకాలు చెబుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo