బుధవారం 25 నవంబర్ 2020
National - Oct 31, 2020 , 15:08:47

న్యాయ్ కౌశ‌ల్ సెంట‌ర్‌ను ప్రారంభించిన చీఫ్ జ‌స్టిస్ బోబ్డే

న్యాయ్ కౌశ‌ల్ సెంట‌ర్‌ను ప్రారంభించిన చీఫ్ జ‌స్టిస్ బోబ్డే

హైద‌రాబాద్‌:  భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి శ‌ర‌ద్ అర‌వింద్ బోబ్డే ఇవాళ ఈ-రిసోర్స్ సెంట‌ర్ న్యాయ కౌశ‌ల్‌ను ప్రారంభించారు. నాగ‌పూర్‌లోని జుడిషియ‌ల్ ఆఫీస‌ర్స్ ట్రైనింగ్ ఇన్స్‌టిట్యూట్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న ఈ కేంద్రాన్ని స్టార్ట్ చేశారు. న్యాయ కౌశ‌ల్ సెంట‌ర్ ద్వారా సుప్రీంకోర్టులో ఎల‌క్ట్రానిక్ ప‌ద్ధ‌తిలో కేసుల‌ను న‌మోదు చేసే వీలు ఉంటుంది.  దేశంలోని హైకోర్టులు, జిల్లా కోర్టుల్లోనూ కేసుల‌ను ఈ-ఫైలింగ్ చేసే అవ‌కాశం ఉంద‌ని చీఫ్ జ‌స్టిస్ తెలిపారు.న్యాయ కౌశల్ దేశంలో తొలి ఈ-రిసోర్స్ సెంట‌ర్ కావ‌డం విశేషం. టెక్నాల‌జీ ఆధారంగా కేసుల‌ను ఫైల్ చేసేందుకు న్యాయ్ కౌశ‌ల్‌ను ప్రారంభించారు.  దీని వ‌ల్ల స‌మ‌యం ఆదా అవుతుంది. దూర ప్ర‌యాణాలు త‌గ్గుతాయి.  డ‌బ్బు ఆదా అవుతుంది. ఇవాళ మ‌హారాష్ట్ర ర‌వాణ శాఖ‌కు చెందిన వ‌ర్చువ‌ల్ కోర్టును కూడా చీఫ్ జ‌స్టిస్ ఆవిష్క‌రించారు.  వ‌ర్చువ‌ల్ కోర్టు ద్వారా చెలాన్ల ఫిర్యాదుల‌ను ప‌రిష్క‌రించే వీలు ఉంటుంద‌ని మ‌హారాష్ట్ర కోర్టు చెప్పింది.