శుక్రవారం 22 జనవరి 2021
National - Dec 26, 2020 , 18:00:37

పట్టాలెక్కనున్న డ్రైవర్‌లెస్‌ ట్రైన్‌

పట్టాలెక్కనున్న డ్రైవర్‌లెస్‌  ట్రైన్‌

ఢిల్లీ: దేశంలోనే మొట్టమొదటి డ్రైవర్‌లెస్‌ మెట్రో ట్రైన్‌(డ్రైవర్‌ రహిత రైలు)ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించనున్నారు. ఢిల్లీ మెట్రోలోని 37 కిలోమీటర్ల పొడవైన మెజెంటా మార్గంలో తొలి డ్రైవర్‌లెస్‌ ట్రైన్‌ పరుగులుపెట్టనుంది.  ఈ రైల్‌ నెట్‌వర్క్‌ నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌-జనక్‌పురి వెస్ట్‌ నుంచి నోయిడాలోని బొటానికల్‌ గార్డెన్‌ వరకు విస్తరించి ఉంది.  ఫుల్లీ ఆటోమేటెడ్‌ డ్రైవర్‌లెస్‌ రైళ్లు  ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా నడువనున్నాయని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.  ఈ కార్యక్రమం తర్వాత సాధారణ  ప్రయాణికులకు సేవలు అందుబాటులోకి వస్తాయని ఢిల్లీ మెట్రో అధికారి ఒకరు తెలిపారు.  


logo