నేడు పట్టాలెక్కనున్న తొలి డ్రైవర్ రహిత రైలు

న్యూఢిల్లీ: దేశంలో తొలి డ్రైవర్ రహిత మెట్రో రైలు నేడు పట్టాలెక్కనుంది. ఈ రైల్వే సర్వీసును సోమవారం ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. దీంతో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఈ ఘనత దక్కించుకోనుంది. ఢిల్లీ మెట్రో కారిడార్‌లోని మెజెంటా లైన్లో జనక్‌పురి వెస్ట్-బొటానికల్ గార్డెన్లో మొత్తం 37 కిలోమీటర్ల మేర ఈ రైలు నడువనుంది. 2021 మధ్యనాటికి ఢిల్లీ మెట్రోలోని 57 కిలోమీటర్ల పింక్ లైన్లో కూడా ఈ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. డ్రైవర్ లేకుండా నడిచే రైళ్లు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 7 శాతం మాత్రమే ఉన్నాయి. దేశంలో ఇదే మొదటి రైలు కావడం విశేషం.
అదేవిధంగా నేషనల్ మొబిలిటీ కార్డును (ఎన్సీఎంసీ) కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. ఢిల్లీ మెట్రోలోని పది కారిడార్లలో మొదటిసారిగా ఎన్సీఎంసీ సేవలు వినియోగంలోకి రానున్నాయి. వన్ నేషన్ వన్ కార్డు నినాదంలో భాగంగా ఎన్సీఎంసీ సేవలను మోదీ ప్రారంభిస్తున్నారు.
తాజావార్తలు
- చచ్చుబడిన కాళ్లలో మళ్లీ కదలికలు!
- కేంబ్రిడ్జ్ ఎనలిటికాపై సీబీఐ కేసు
- టీకా అంటూ ఫోన్లు వస్తే నమ్మొద్దు
- మెట్రోనగరి.. మేలైన స్థిరాస్తి!
- సర్కార్‌ను విమర్శిస్తే నేరమే!
- పట్టభద్రుల ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించాలి
- సేవలు అభినందనీయం
- వ్యవసాయ పనుల్లో బాలకార్మికులు
- టీకాలపై రాజకీయాలొద్దు: మోదీ
- ఆలయ ప్రహరీ మరమ్మతు ప్రారంభం