గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 02:59:42

ఒక్కరోజులో 4.20 లక్షల టెస్టులు

ఒక్కరోజులో 4.20 లక్షల టెస్టులు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా శుక్రవారం నుంచి శనివారం ఉదయానికి 24 గంటల్లోనే 4,20,898 కరోనా పరీక్షలను నిర్వహించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కట్టడిలో కొవిడ్‌ పరీక్షల నిర్వహణ, కరోనా రోగుల క్వారంటైన్‌ కీలకమైన నేపథ్యంలో టెస్టింగ్‌ సామర్థ్యాన్ని క్రమంగా పెంచుతున్నట్టు తెలిపింది. జనవరిలో కేవలం ఒకే ఒక్క కరోనా పరీక్షా కేంద్రం ఉన్నదని, ప్రసుత్తం టెస్టింగ్‌ కేంద్రాల సంఖ్య 1,301కి పెరిగిందని పేర్కొన్నది. ఇండియాలో ఇప్పటి వరకు 1,58,49,068 కరోనా పరీక్షలు నిర్వహించారు. దేశంలో కొవిడ్‌ మరణాల రేటు శుక్రవారం 2.35 శాతానికి పడిపోయింది. కొవిడ్‌ నుంచి కోలుకున్నవారి సంఖ్య(రికవరీ రేటు) 63.54కు పెరిగింది. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా కొత్తగా 48,916 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 13,36,861కి పెరిగింది. కరోనా నుంచి కోలుకొని ఇప్పటివరకు 8,49,431 డిశ్చార్జి అయ్యారు. ఇంకా 4,56,071 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కొత్తగా 757 మంది చనిపోవడంతో మరణాల సంఖ్య 31,358కి పెరిగింది. 

వివిధ దేశాల్లో జనాభా  పరంగా కరోనా కేసులు, మృతులు,  పరీక్షల సంఖ్యlogo