మంగళవారం 22 సెప్టెంబర్ 2020
National - Aug 10, 2020 , 13:46:27

చరిత్ర సృష్టించిన భారత్.. కరోనా నుంచి కోలుకున్న 15 లక్షల మంది

చరిత్ర సృష్టించిన భారత్.. కరోనా నుంచి కోలుకున్న 15 లక్షల మంది

న్యూఢిల్లీ: భారత్ మరో చరిత్ర సృష్టించింది. సోమవారం నాటికి దేశవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 15 లక్షలను దాటింది. శనివారం నుంచి ఆదివారం వరకు గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 54,859 మంది కరోనా రోగులు కోలుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా కోలుకున్నవారి సంఖ్య 15,35,744కి చేరింది. దేశంలో కరోనా బారిన పడిన వారిలో 70 శాతం మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. 6,34,945 యాక్టిక్ కేసులతో పోల్చితే కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 9 లక్షలు ఎక్కువని పేర్కొంది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిందని ప్రస్తుతం 28.66 శాతం పాటిజివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది. కరోనా మరణాల రేటు కూడా క్రమంగా తగ్గుతున్నదని, ప్రస్తుతం ఇది 2 శాతం ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.

ఒకవైపు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య ఊరట నిస్తున్నా.. మరోవైపు దేశంలో కరోనా కేసులు, మరణాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 62,064 కరోనా కేసులు, 1,007 మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,15,075కు, మ‌ర‌ణాల సంఖ్య 44,386కు చేరింది. దేశ‌వ్యాప్తంగా కొత్తగా న‌మోద‌వుతున్న పాజిటివ్ కేసుల్లో 80 శాతం ప‌ది రాష్ట్రాల్లోనే నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.logo