శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 14, 2020 , 09:58:47

24 గంటల్లో 28,498 కేసులు..553 మరణాలు

24 గంటల్లో 28,498 కేసులు..553 మరణాలు

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది.  దేశంలో కరోనా కేసుల సంఖ్య 9లక్షలు దాటింది.  గడచిన 24 గంటల్లో 28,498 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 553 మంది మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా  బాధితుల సంఖ్య  9,06,752కు పెరిగింది.  ప్రస్తుతం  3,11,565  మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ  5,71,460 మంది  కోలుకున్నారు.

కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 23,727కు చేరింది. జూలై 13 వరకు దేశవ్యాప్తంగా  1,20,92,503 శాంపిల్స్‌ టెస్టు చేశారు. నిన్న ఒక్కరోజే  2,86,247  మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.  భారత్‌లో కరోనా రికవరీ రేటు  63.02శాతానికి పెరిగింది. 


logo