శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 26, 2020 , 10:15:15

దేశంలో 32 వేలు దాటిన క‌రోనా మ‌ర‌ణాలు

దేశంలో 32 వేలు దాటిన క‌రోనా మ‌ర‌ణాలు

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా ఉధృతి కొన‌సాగుతున్న‌ది. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 48,661 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయ‌ని, 705 మంది మ‌ర‌ణించార‌ని కేంద్ర ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య 13,85,522కి చేర‌గా, క‌రోనా మ‌ర‌ణాలు 32,063కు పెరిగాయి. ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన క‌రోనా పాజిటివ్‌ల‌లో 8,85,577 మంది క‌రోనా నుంచి కోలుకోగా, 4,67,882 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయ‌ని ప్ర‌క‌టించింది. గడిచిన 24 గంట‌ల్లో 32,223 మంది కోలుకున్నార‌ని, రిక‌వ‌రీ రేటు 63.54 శాతానికి పెరిగింద‌ని తెలిపింది. 

శ‌నివారం ఒక్క‌రోజే దేశ‌వ్యాప్తంగా 4,42,263 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేశామ‌ని, జూలై 25 వ‌ర‌కు 1,62,91,331 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని భార‌తీయ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి (ఐసీఎమ్మార్‌) ప్ర‌క‌టించింది. 


logo