బుధవారం 12 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 01:24:24

ఒక్కరోజులోనే 36,569 మంది రికవరీ

ఒక్కరోజులోనే 36,569 మంది రికవరీ

  • 2.15 శాతానికి తగ్గిన మరణాలు
న్యూఢిల్లీ, ఆగస్టు 1: దేశంలో కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. శుక్రవారం నుంచి శనివారం నాటికి 24 గంటల వ్యవధిలో 36,569 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 10,94,374కు చేరింది. ఇదే సమయంలో కరోనా మరణాలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. జూన్‌లో 3.33 శాతంగా ఉన్న మరణాలు ప్రస్తుతం 2.15 శాతానికి తగ్గాయి. మరోవైపు 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 57,118 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 16,95,988కి పెరిగింది.


logo