గురువారం 09 జూలై 2020
National - Jun 21, 2020 , 01:25:20

4 లక్షలకు చేరువలో కొవిడ్‌ కేసులు

4 లక్షలకు చేరువలో  కొవిడ్‌ కేసులు

  • మొదటి లక్షకు 64 రోజులు 
  • మూడో లక్షకు 8 రోజులే 
  • 12,948కి చేరిన మృతులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. మొత్తం కేసులు 3,95,048 చేరుకున్నాయి. శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు ఒక్కరోజులోనే 14,516 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒకరోజులో 10 వేలకు పైగా కొత్త్త కేసులు నమోదు కావడం ఇది వరుసగా తొమ్మిదో రోజు. తాజాగా 375 మంది మరణించడంతో మృతుల సంఖ్య 12,948కు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది.

2,13,830 మంది రోగులు కోలుకోగా, మరో 1,68,269 మంది చికిత్స పొందుతున్నారని తెలిపింది. రికవరీ 54.12 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు. ఈ నెల 1 నుంచి 20 వరకు రెండు లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఏడు రాష్ర్టాల్లోనే 3.03 లక్షల కేసులు వెలుగుచూశాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌లో ఎక్కువ కేసులున్నాయి. మొదటి లక్ష కేసులకు 64 రోజులు సమయం పడితే.. 2 లక్షలకు చేరుకోవడానికి 14 రోజులు, 3 లక్షల మార్కును చేరటానికి కేవలం 8 రోజులు పట్టింది. ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల నమోదులో భారత్‌ నాలుగోస్థానంలో, మృతుల్లో ఎనిమిదో స్థానంలో ఉన్నది. 


logo