గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 03:19:56

15 లక్షలు దాటిన కేసులు

15 లక్షలు దాటిన కేసులు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు 15 లక్షల మార్క్‌ను దాటేశాయి. వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 14 లక్షలు దాటిన రెండు రోజుల్లో బుధవారం నాటికి మరో లక్ష కేసులు దాటాయి. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు కొత్తగా 48,513 కేసులతో మొత్తం మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 15,31,669కు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గత 24 గంటల్లో 768 మంది ప్రాణాలు కోల్పోగా, ఇప్పటివరకు సంభవించిన మృతులు 34,193కు చేరాయి. మొత్తం కొవిడ్‌ కేసుల్లో 9,88,029 మంది కోలుకున్నారు. కోలుకున్న రోగులు 64.51 శాతానికి చేరుకున్నారు.  ప్రపంచవ్యాప్త మృతులతో పోలిస్తే భారత్‌లో మరణాల రేటు మరింత తగ్గుముఖం పట్టిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఏప్రిల్‌ 1 నుంచి పోలిస్తే బుధవారం మృతుల రేటు 2.23 శాతం అతి తక్కువ అని ఓ ప్రకటనలో వెల్లడించింది. logo