మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 15:18:05

‘దేశంలో కరోనా రికవరీ రేటు 64.54 శాతం’

‘దేశంలో కరోనా రికవరీ రేటు 64.54 శాతం’

న్యూఢిల్లీ : దేశంలో కరోనా రికవరీ రేటు 64.54 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ తెలిపారు. గురువారం వరకు దేశవ్యాప్తంగా మిలియన్‌ మంది కరోనా నుంచి కోలుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు 16,38,870 మంది కరోనా బారినపడ్డారని వెల్లడించారు. దేశంలో కరోనా పరిస్థితిపై శుక్రవారం ఢిల్లీలోని నిర్మన్‌ భవన్‌లో మంత్రుల బృందంతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా బారినపడిన వారిలో 2/3 వంతురోగులు కోలుకుంటున్నారని, ఇప్పటివరకు మరణాల నమోదు శాతం కేవలం 2.18 మాత్రమేనని స్పష్టం చేశారు.

గడిచిన 24 గంటల్లో 6,42,588 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని, గత నెల వరకు కోటి మందికి పూర్తి చేశామని తెలిపారు. కరోనా రోగుల్లో 0.27 శాతం మంది వెంటిలేటర్‌పై ఉన్నారని, 1.58 శాతం మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, 2.28 శాతం మందికి ఆక్సిజన్‌ అందిస్తున్నామని చెప్పారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌ జయ్‌శంకర్‌, పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 


logo