సోమవారం 06 జూలై 2020
National - Jun 29, 2020 , 15:43:18

దేశంలో 58.67 శాతానికి క‌రోనా రిక‌వ‌రీ రేటు

దేశంలో 58.67 శాతానికి క‌రోనా రిక‌వ‌రీ రేటు

న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకు కొత్త‌గా న‌మోద‌య్యే క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతున్నా.. రిక‌వ‌రీ అవుతున్న వారి సంఖ్య‌ కూడా స‌గ‌టున అంత‌కుమించే పెరుగుతుండ‌టంతో రిక‌వ‌రీ రేటు క్ర‌మంగా మెరుగుప‌డుతున్న‌ది. సోమ‌వారం ఉద‌యానికి దేశ‌వ్యాప్తంగా 5,48,318 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదుకాగా, 3,21,723 మంది వైర‌స్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మ‌రో 2,10,120 యాక్టివ్ కేసులు ఉన్నాయి. యాక్టివ్ కేసుల కంటే రిక‌వ‌రీ అయిన వారి సంఖ్య 1,11,602 ఎక్కువ‌గా ఉండ‌టంతో దేశంలో రిక‌వ‌రీ రేటు మెరుగుప‌డి 58.67 శాతానికి చేరింది. 

కాగా, ఆదివారం ఉద‌యం నుంచి సోమ‌వారం ఉద‌యానికి గ‌త 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశ‌వ్యాప్తంగా 12,010 మంది వైర‌స్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇదిలావుంటే ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య‌ 16,475కు చేరింది. దేశంలో ప్ర‌స్తుతం 1,047 టెస్టింగ్ ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయ‌ని, అందులో 760 ప్ర‌భుత్వ ల్యాబ్‌లు కాగా 287 ప్రైవేట్ ల్యాబ్‌లు ఉన్నాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. గ‌త 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో కొత్త‌గా 11 ప్ర‌భుత్వ ల్యాబ్‌ల‌ను అందుబాటులోకి తెచ్చిన‌ట్లు తెలిపింది.  


logo