ఆదివారం 12 జూలై 2020
National - Jun 27, 2020 , 16:16:42

దేశంలో కొవిడ్‌-19 రికవరీ రేటు 58శాతం : కేంద్రమంత్రి

దేశంలో కొవిడ్‌-19 రికవరీ రేటు 58శాతం : కేంద్రమంత్రి

న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్‌-19 రికవరీ రేటు 58శాతానిపైగా పెరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ శనివారం తెలిపారు.  మొత్తం 5లక్షల మంది బాధితుల్లో 3లక్షల మంది కొవిడ్‌-19 నుంచి కోలుకొని ఇండ్లకు వెళ్లారని, మిగతా వారంతా కోలుకుంటున్నారని చెప్పారు. బాధితుల్లో 85శాతం మంది ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉన్నారన్నారు. వైరస్‌తో మృతి చెందిన వారిలో 87శాతం ఈ ఎనిమిది రాష్ట్రాల నుంచే ఉండగా, డెత్‌ రేటు 3శాతానికి దగ్గరగా ఉందని తెలిపారు.

దేశంలో పరీక్షల సదుపాయాలు గణనీయంగా పెంచామని, శుక్రవారం దేశవ్యాప్తంగా 1,026 గుర్తించిన ల్యాబుల్లో 2.30లక్షల పరీక్షలు చేసినట్లు చెప్పారు. అంతకు ముందు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అధ్యక్షతన మంత్రుల బృందం (జీవోఎం) సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఇందులో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి పాల్గొన్నారు. గత 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 18,552 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా, శనివారం 5లక్షల మార్కును దాటింది.


logo