మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 17, 2020 , 21:24:57

ప్ర‌పంచ అత్యుత్త‌మ కోవిడ్ రిక‌వ‌రీ దేశాల్లో భార‌త్ ఒక‌టి : ప‌్ర‌ధాని

ప్ర‌పంచ అత్యుత్త‌మ కోవిడ్ రిక‌వ‌రీ దేశాల్లో భార‌త్ ఒక‌టి : ప‌్ర‌ధాని

ఢిల్లీ : ప‌్ర‌పంచంలోనే అత్యుత్త‌మ కోవిడ్‌-19 రిక‌వ‌రీ రేట్ల‌లో భార‌త‌దేశం ఒక‌ట‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ అన్నారు. యునైటెడ్ నేష‌న్స్ ఎక‌నామిక్ అండ్ సోషియ‌ల్ కౌన్సిల్ అత్యున్న‌త‌స్థాయి స‌మావేశంలో ప్ర‌ధాని మోదీ వ‌ర్చ‌వ‌ల్ ఉప‌న్యాసం చేశారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మాట్లాడుతూ... కోవిడ్-19 మ‌హ‌మ్మారి అన్ని దేశాల‌ను తీవ్రంగా ప‌రీక్షించింద‌న్నారు. మ‌హ‌మ్మారికి వ్య‌తిరేకంగా భార‌త్‌లో పోరాటం ప్ర‌జా ఉద్య‌మంగా మార్చేందుకు ప్ర‌య‌త్నించిన‌ట్లు తెలిపారు. ప్ర‌భుత్వం, పౌర స‌మాజాన్ని క‌ల‌ప‌డం ద్వారా ప్ర‌య‌త్నించిన‌ట్లు వెల్ల‌డించారు.

స్వ‌తంత్ర దేశంగా భార‌త్ 75 సంవ‌త్స‌రాలు పూర్తిచేసుకునేనాటికి 2022 నాటికి ప్ర‌తీ భార‌తీయుడు సుర‌క్షిత‌మైన ఇంట్లో ఉండేవిధంగా అంద‌రికి ఇళ్లు కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టిన‌ట్లు తెలిపారు. ఏ ఒక్క‌రిని విడిచిపెట్ట‌కుండా న‌మ్మ‌కంతో అంద‌రి ఎదుగుద‌ల‌కు కృషిచేయ‌డం ఇదే త‌మ నినాద‌మ‌న్నారు. దేశీయ ప్రయత్నాల ద్వారా అజెండా 2030 సాధించేందుకు కృషి చేస్తున్న‌ట్లు తెలిపారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న‌ట్లు చెప్పారు. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు సైతం వారి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో కూడా తాము మద్దతు ఇస్తున్నామ‌న్నారు. 

యూఎన్ అదేవిధంగా ఎక‌నామిక్ అండ్ సోషియ‌ల్ కౌన్సిల్ అభివృద్ధి ప‌నుల‌కు భార‌త్ మొద‌టినుండి మ‌ద్ద‌తు ఇచ్చిన‌ట్లు ప్ర‌ధాని తెలిపారు. యునైటెడ్ నేష‌న్స్ ఎక‌నామిక్ అండ్ సోషియ‌ల్ కౌన్సిల్ మొదటి అధ్యక్షుడు ఒక భారతీయుడు అన్నారు. ఎక‌నామిక్ అండ్ సోషియ‌ల్ కౌన్సిల్‌ ఎజెండాను రూపొందించడానికి భారత్ కూడా దోహదపడింద‌న్నారు. 

కరోనా క‌ట్ట‌డికి అన్ని దేశాల‌తో క‌లిసి ప‌నిచేస్తున్నామ‌న్నారు. 150 దేశాల‌కు క‌రోనా మందుల‌తో పాటు సామాగ్రిని అందిస్తున్న‌ట్లు తెలిపారు. భార‌త్ అభివృద్ధికి అనేక చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు చెప్పారు. ప్ర‌పంచంలో భార‌త్ ప్ర‌త్యేక పాత్ర పోషిస్తోందన్నారు. ఆయుష్మాన్ అనేది పెద్ద ఆరోగ్య కార్య‌క్ర‌మం అన్నారు. సుమారు 40 కోట్ల మందితో బ్యాంక్ ఖాతాలు తెరిపించిన‌ట్లు వెల్ల‌డించారు. 7 కోట్ల మంది మ‌హిళ‌లు స్వ‌యం స‌హాయ‌క సంఘాల్లో ఉన్నారన్న ప్ర‌ధాని భార‌త్‌ను 2025 నాటికి టీబీ ర‌హిత దేశంగా మారుస్తామ‌ని పేర్కొన్నారు. 


logo