సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 01:26:14

14 లక్షలు దాటిన కేసులు

14 లక్షలు దాటిన కేసులు

న్యూఢిల్లీ, జూలై 27: దేశంలో కరోనా కేసుల సంఖ్య 14 లక్షలను దాటింది. ఆదివారం నుంచి సోమవారం వరకు 24 గంటల వ్యవధిలో 49,931 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 14,35,453కు చేరింది. మరోవైపు వైరస్‌ బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నది. ఇప్పటి వరకు 9,17,567 మంది కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 63.92గా నమోదైంది. 

కర్ణాటకలో లక్ష దాటిన కేసులు

కర్ణాటకలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య లక్ష దాటింది. సోమవారం రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 5,324 కేసులు నమోదయ్యాయి. 75 మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 1,01,465కు చేరింది. మరణాల సంఖ్య 1,953కు పెరిగింది. 


logo