శుక్రవారం 22 జనవరి 2021
National - Dec 18, 2020 , 09:52:17

దేశంలో కోటికి చేరువలో కరోనా కేసులు

దేశంలో కోటికి చేరువలో కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా బాధితులు కోటికి చేరువయ్యారు. గత 24 గంటల్లో కొత్తగా 22,889 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 99,74,447కు చేరాయి. ఇందులో 95,20,827 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 3,13,831 మంది చికిత్స పొందుతున్నారు. మరో 1,44,789 మంది బాధితులు మహమ్మారి వల్ల మరణించారు. కాగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 338 మంది బాధితులు మరణించగా, 31,087 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. 

దేశంలో రికవరీ రేటు 95.31 శాతంగ ఉందని, మరణాల రేటు 1.45 శాతం, యాక్టివ్‌ కేసులు 3.24 శాతంగా ఉన్నాయని తెలిపింది. తాజాగా కరోనా నుంచి కోలుకున్నవారిలో ఐదు రాష్ట్రాల్లోనే 55 శాతం మంది ఉన్నారని వెల్లడించింది. ఇందులో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులో ఎక్కువగా ఉన్నారని తెలిపింది.  

దేశవ్యాప్తంగా నిన్నటివరకు 15,89,18,646 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్‌) ప్రకటించింది. ఇందులో నిన్న ఒక్కరోజే 11,13,406 నమూనాలను పరీక్షించామని తెలిపింది.  


logo