శుక్రవారం 15 జనవరి 2021
National - Dec 05, 2020 , 10:01:58

దేశంలో 96 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో 96 లక్షలు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు 96 లక్షలు దాటాయి. గత 24 గంటల్లో కొత్తగా 36,652 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 512 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 96,08,211కు చేరగా, 1,39,700 బాధితులు మరణించారు. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 4,09,689 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 90,58,822 మంది బాధితులు కరోనా నుంచి కోలుకు న్నారు. దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 42,533 మంది డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 18,42,587 మంది కరోనా బారినపడగా, 47,599 మంది మరణించారు. నిన్న ఒక్కరోజే 5229 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక 8,90,360 పాజిటివ్‌ కేసులతో కర్ణాటక రెండో స్థానంలో ఉండగా, 8,70,675 కేసులతో ఆంధ్రప్రదేశ్‌, 7,87,554 కేసులతో తమిళనాడు తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.