శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 06, 2020 , 10:06:56

దేశంలో 84 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

దేశంలో 84 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

న్యూఢిల్లీ: ‌దేశంలో కొత్త‌గా 47,638 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో క‌రోనా కేసుల సంఖ్య 84,11,724కు చేరింది. ఇందులో 5,20,773 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మ‌రో 77,65,966 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 54,157 మంది బాధితులు డిశ్చార్జి కాగా, నిన్నటి కంటే 7,189 యాక్టివ్ కేసులు త‌గ్గాయ‌ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్ర‌క‌టించింది. నిన్న ఉద‌యం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా వ‌ల్ల 670 మంది మ‌ర‌ణించారు. దీంతో దేశంలో క‌రోనా మృతుల సంఖ్య 1,24,985కు పెరిగింది.