మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Oct 31, 2020 , 10:12:10

దేశంలో 81 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

దేశంలో 81 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కొత్త‌గా 48,268 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 81,37,119కి చేరాయి. ఇందులో 5,82,649 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇది నిన్నటి కంటే 11,737 త‌క్కువ‌. అదేవిధంగా క‌రోనా భారిన‌ప‌డివారిలో 74,32,829 మంది కోలుకున్నారు. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 59,454 మంది క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి బ‌య‌ట ప‌డ్డారు. కాగా, క‌రోనా వ‌ల్ల నిన్న ఉద‌యం నుంచి ఈరోజు ఉద‌యం వ‌ర‌కు 551 మంది మ‌ర‌ణించారు. దీంతో మొత్తం క‌రోనా మృతుల సంఖ్య 1,21,641కి చేరింద‌ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌శాఖ ప్ర‌క‌టించింది. క‌రోనా రిక‌వ‌రీరేటు 91 శాతానికి చేరింద‌ని తెలిపింది.