గురువారం 29 అక్టోబర్ 2020
National - Sep 28, 2020 , 09:51:02

దేశంలో 60 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

దేశంలో 60 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా కేసులు కొంచెం త‌గ్గాయి. గ‌త నాలుగు రోజులుగా 85 వేల‌కు పైగా న‌మోద‌వుతుండ‌గా, ఈరోజు ఆ సంఖ్య 82 వేల‌కు త‌గ్గింది. దీంతో దేశంలో మొత్తం క‌రోనా కేసులు 60 ల‌క్ష‌ల మార్కును దాటాయి. అయితే క‌రోనా కేసుల కంటే కోలుకుంటున్నవారి సంఖ్య అధికంగా ఉంటున్న‌ది. రోజువారీ కేసుల్లో మొద‌టిస్థానంలో ఉన్న భార‌త్‌, రిక‌వ‌రీ రేటులో ప్ర‌పంచంలోనే అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్న‌ది.  

దేశంలో గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 82,170 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం క‌రోనా కేసులు 60,74,703కు చేరాయి. ఇందులో 9,62,640 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా, 50,16,521 మంది క‌రోనా బాధితులు కోలుకున్నారు. నిన్న ఉద‌యం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 1039 మంది క‌రోనాతో చ‌నిపోయారు. దీంతో మొత్తం క‌రోనా మృతులు 95,542కు పెరిగార‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ‌శాఖ ప్ర‌క‌టించింది. 

నిన్న ఒక్క‌రోజే 7,09,394 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని భార‌తీయ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి (ఐసీఎమ్మార్‌) ప్ర‌క‌టించింది. సెప్టెంబ‌ర్ 27న 7,19,67,230 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని తెలిపింది.    


logo