గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 03:06:30

టీకా ఎక్కడిదైనా మనకు మేలే!

టీకా ఎక్కడిదైనా మనకు మేలే!

  • విదేశాల్లో, మనదేశంలో వ్యాపిస్తున్న వైరస్‌ ఒకే రకం సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా వెల్లడి

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్‌కి సంబంధించి భారతీయులకు నిపుణులు శుభవార్త చెప్పారు. దేశంలో నమోదైన అత్యధిక కేసులకు సంబంధించిన వైరస్‌ జాతి, ప్రపంచ దేశాల్లో వ్యాపిస్తున్న వైరస్‌ జాతి దాదాపు ఒకటేనని, రెండింటి మధ్య పోలికలు ఎక్కువగా ఉన్నట్టు సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) డెరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా తెలిపారు. ఈ కారణం వల్ల మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్‌ ప్రపంచంలో ఎక్కడ తయారైనప్పటికీ, అది భారతీయులపై సమర్థవంతంగా పనిచేస్తుందని వెల్లడించారు. ప్రపంచ దేశాల్లో ఏ2ఏ రకానికి చెందిన వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్నదని, దేశంలో వ్యాపిస్తున్న దాదాపు 80-90శాతం వైరస్‌ జన్యుక్రమంతో ఇది దగ్గరి పోలికలను కలిగి ఉన్నదన్నారు. ప్రతి పదిహేను రోజుల్లో ఒకసారి ఉత్పరివర్తనం చెందుతున్న కరోనా వైరస్‌ రానున్న కాలంలో బలహీనపడుతుందన్నారు. రోగులు భయపడాల్సిన అవసరంలేదని సూచించారు. 


logo