గురువారం 26 నవంబర్ 2020
National - Nov 11, 2020 , 09:50:12

దేశంలో 86 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

దేశంలో 86 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా కేసులు 86 ల‌క్ష‌లు దాటాయి. గ‌త కొన్ని రోజులుగా కొత్త పాజిటివ్‌ కేసుల కంటే కోలుకుంటున్నవారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతున్న‌ది. దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంటల్లో కొత్తగా 44,281 క‌రోనా కేసులు న‌మోదయ్యాయి. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం క‌రోనా కేసుల సంఖ్య‌ 86,36,012కు చేరింది. ఇందులో 80,13,784 మంది క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మ‌రో 4,94,657 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, క‌రోనా బారిన‌ప‌డినవారి సంఖ్య 1,27,571కి పెరిగింది. నిన్న ఉద‌యం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు మ‌రో 512 మంది మ‌ర‌ణించార‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ ప్ర‌క‌టించింది. అదేవిధంగా నిన్న 50,326 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకోగా, యాక్టివ్ కేసుల్లో 6,557 త‌గ్గాయ‌ని వెల్ల‌డించింది. 

దేశ‌వ్యాప్తంగా న‌వంబ‌ర్ 10 వ‌ర‌కు 12,07,69,1515 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేశామ‌ని భార‌తీయ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి (ఐసీఎమ్మార్‌) ప్ర‌క‌టించింది. ఇందులో నిన్న ఒకేరోజు 11,53,294 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని వెల్ల‌డించింది.