గురువారం 26 నవంబర్ 2020
National - Sep 20, 2020 , 10:09:29

దేశంలో కొత్త‌గా 92 వేల క‌రోనా పాజిటివ్‌లు

దేశంలో కొత్త‌గా 92 వేల క‌రోనా పాజిటివ్‌లు

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా ఉగ్ర‌రూపం కొన‌సాగుతూనే ఉన్న‌ది. అయితే ఐదురోజుల క్రితం ల‌క్ష‌కు చేరువ‌గా న‌మోదైన క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. నిన్న 93 వేలు న‌మోద‌వ‌గా, ఈరోజు దానికి వెయ్యి త‌క్కువ‌గా రికార్డ‌య్యాయి. దీంతో మొత్తం క‌రోనా కేసులు 54 ల‌క్ష‌లు దాటాయి. 

దేశ‌వ్యాప్తంగా గ‌డిచిన‌ 24 గంట‌ల్లో కొత్త‌గా 92,605 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య 54,00,620 చేరింది. ఇందులో 10,10,824 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా, మ‌హ‌మ్మారి బారిన‌ప‌డిన 43,03,044 మంది కోలుకున్నారు. క‌రోనా వ‌ల్ల కొత్త‌గా 1,133 మంది చ‌నిపోయారు. దీంతో క‌రోనా మృతులు 86,752కు చేరాయని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ ప్ర‌క‌టించింది.  

నిన్న ఒక్క‌రోజే 12,06,806 మందికి క‌రోనా ప‌రీక్షలు నిర్వ‌హించామ‌ని భార‌తీయ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి ప్ర‌క‌టించింది. దీంతో సెప్టెంబ‌ర్ 19 వ‌ర‌కు 6,36,61,060 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని తెలిపింది.