ఆదివారం 12 జూలై 2020
National - Jun 22, 2020 , 16:39:04

దేశంలో ప్ర‌తి ల‌క్ష‌లో 30 మందికి క‌రోనా!

దేశంలో ప్ర‌తి ల‌క్ష‌లో 30 మందికి క‌రోనా!

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్ర‌తిరోజు 10 వేలకు త‌గ్గ‌కుండా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. దీంతో ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా న‌మోదైన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగు ల‌క్ష‌లు దాటింది. అయితే దేశంలో క‌రోనా ప‌రిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా జనాభా నిష్ప‌త్తి ప్ర‌కారం చూస్తే ప్ర‌పంచ స‌గ‌టు కంటే దేశ స‌గ‌టు మెరుగ్గా ఉంద‌ని  ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో) వెల్ల‌డించింది. 

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌తి ల‌క్ష మందికి 114.67 మంది క‌రోనా బాధితులు ఉంటే, దేశంలో మాత్రం ప్ర‌తి ల‌క్ష మందికి క‌రోనా రోగుల సంఖ్య 30.04 శాతంగా ఉంద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో తెలిపింది. 2020, జూన్ 21 నాటి గ‌ణాంకాల ప్ర‌కారం డ‌బ్ల్యూహెచ్‌వో ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. కాగా, రోజురోజుకు క‌రోనా బారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండ‌టంతో దేశంలో రిక‌వ‌రీ రేటు 55.77 శాతానికి పెరిగింది.  


    


logo