ఆదివారం 29 నవంబర్ 2020
National - Oct 23, 2020 , 13:15:01

2 నెల‌ల త‌ర్వాత తిరిగి 7 ల‌క్ష‌ల దిగువ‌కు యాక్టివ్ కేసులు!

2 నెల‌ల త‌ర్వాత తిరిగి 7 ల‌క్ష‌ల దిగువ‌కు యాక్టివ్ కేసులు!

న్యూఢిల్లీ: ‌దేశంలో క‌రోనా యాక్టివ్ కేసుల సంఖ్య క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్న‌ది. ప్ర‌తిరోజు కొత్త‌గా న‌మోద‌య్యే క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వ‌స్తున్న‌ది. అదే స‌మ‌యంలో రిక‌వ‌రీ అయ్యేవారి సంఖ్య కొత్త‌గా న‌మోద‌య్యే కేసుల కంటే ఎక్కువ‌గా ఉంటున్న‌ది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య క్ర‌మంగా త‌గ్గుతూ ప్ర‌స్తుతం 7 ల‌క్ష‌ల దిగువ‌కు చేరింది. శుక్ర‌వారం ఉద‌యానికి దేశంలోని మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య‌ 6,97,330గా ఉన్న‌ది. కాగా, గ‌త రెండు నెల‌ల్లో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య ఏడు ల‌క్ష‌ల దిగువ‌కు రావ‌డం ఇదే తొలిసార‌ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. 2020, ఆగ‌స్టు 22న దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య ఏడు ల‌క్ష‌లు దాటిందని, దాదాపు అర‌వై మూడు రోజుల త‌ర్వాత తిరిగి ఇప్పుడు ఏడు ల‌క్ష‌ల దిగువ‌కు చేరింద‌ని కేంద్రం వెల్ల‌డించింది.              

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.