బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 11, 2020 , 15:06:22

ఇదే అతిపెద్ద వన్యమృగ సర్వే.. గిన్నిస్ ‌రికార్డులో చోటు

ఇదే అతిపెద్ద వన్యమృగ సర్వే.. గిన్నిస్ ‌రికార్డులో చోటు

న్యూఢిల్లీ : దేశంలో పులుల గణన కోసం ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్‌ అతిపెద్ద వన్యమృగ సర్వేగా శనివారం గిన్సిస్‌ వరల్డ్‌ రికార్డును సృష్టించింది. 2018 సంవత్సరానికి గాను ఈ రికార్డును నమోదు చేసిందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. పీఎం నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం నాలుగు సంవత్సరాల కిందట పులుల సంఖ్యను రెట్టింపు చేయాలని సంకల్పించామని, ఈ మేరకు లక్ష్యాన్ని సాధించగలిగామన్నారు. 2018లో దేశంలో 2,967 పులులుండగా, వీటిలో సగానికి పైగా మధ్యప్రదేశ్‌, కర్ణాటకల్లో ఉన్నాయి.

ఆ సంవత్సరం పులుల అంచనా నివేదిక ప్రకారం..  కెమెరా ట్రాప్‌లు 139 అధ్యయన సైట్లలో 26,760 విభిన్న ప్రదేశాల్లో ఏర్పాటు చేశారు. ఇవి సుమారు 35 మిలియన్ ఫొటోలను తీశాయి. వీటిలో 76,523 పులి, 51,337 చిరుత పులుల ఫొటోలు ఉన్నాయి. పులుల సంఖ్య 2014లో 2226 నుంచి 2967కు చేరుకున్నాయి. ప్రకృతి ప్రేమికులను సంతోషపెట్టేలా ప్రధాని మోదీ ఈ డేటాను విడుదల చేశారు. 2014 లో మొత్తం అంచనా 2,226 ఉండగా 2014 లో చివరి గణన నుంచి దాదాపు 33% పెరుగుదల కనిపించింది. పులుల గణనలో ఇది కొత్త ప్రపంచ ప్రమాణాన్ని నిర్దేశించడమే కాక, ప్రోత్సాహకరమైన ఫలితాలు పులి సంరక్షణలో భారతదేశం చేసిన ప్రయత్నాలను ధ్రువీకరించాయి.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


తాజావార్తలు


logo