గురువారం 04 జూన్ 2020
National - Apr 02, 2020 , 01:32:50

గ్రీన్‌కార్డుకు దశాబ్దాలు వేచిచూడాల్సిందే!

గ్రీన్‌కార్డుకు దశాబ్దాలు వేచిచూడాల్సిందే!

న్యూఢిల్లీ: అమెరికాలో శాశ్వత నివాస హోదా కోసం వేచి ఉండేవారి సంఖ్య 2030 నాటికి రెట్టింపు అవుతుందని, గ్రీన్‌కార్డ్‌ కోసం భారతీయులు దశాబ్దాలపాటు నిరీక్షించాల్సి ఉంటుందని కాంగ్రెషనల్‌ రీసెర్చ్‌ సర్వీస్‌ (సీఆరెస్‌) నివేదిక పేర్కొంది. గ్రీన్‌కార్డ్‌ కోసం ఆమోదంపొంది వేచి ఉన్నవారు 10 లక్షల మంది ఉన్నారు. ప్రస్తుత చట్టం ప్రకారం మూడేండ్లకు ఒక్కో దేశ పరిమితిని తొలగించి, విదేశీ నిపుణులకు గ్రీన్‌కార్డులను రిజర్వు చేస్తారు. ఉపాధి ఆధారంగా ఈబీ1, ఈబీ2, ఈబీ3 వర్గాలకు జారీచేసే గ్రీన్‌కార్డ్‌ల సంఖ్య 1,20,120 పరిమితిని  పెంచరు. సవరించిన ఎస్‌ 386 చట్టం ప్రకారం దేశాలకు ఏడు శాతం కోటా కేటాయింపును తొలగిస్తే నిరీక్షిస్తున్నవారిలో భారత, చైనా దేశాలవారికి స్వల్ప కాలపరిమితి తగ్గునుంది. ఈబీ1 బ్యాక్‌లాగ్‌ సంఖ్య 1,19,732 నుంచి 2030 నాటికి 2,68,246కు పెరుగనుంది. ఈబీ2 వారి సంఖ్య 6,27,448 నుంచి 14,71,360కు, ఈబీ3 వారి సంఖ్య 1,68,317 నుంచి 4,56,190కి పెరుగనుంది. పై మూడు వర్గాలవారి సంఖ్య 9,15,497 నుంచి 2030 నాటికి 21,95,795 పెరుగనుంది. సవరించిన చట్టం ఎస్‌ 386 అమలు చేసినా గ్రీన్‌కార్డుల జారీలో నిరీక్షణ కాలపరిమితి స్వల్పంగానే తగ్గుతుందని కాంగెస్‌ నివేదిక తెలిపింది. గ్రీన్‌కార్డుల కోసం నిరీక్షిస్తున్నవారిలో హెచ్‌-1బీ వీసా విభాగంలో ఈబీ2, ఈబీ3 దరఖాస్తుదారులు భారతీయులే అధికంగా ఉన్నారు. వీరికి గ్రీన్‌కార్డు రావడానికి దశాబ్దాలు నిరీక్షించక తప్పదని కాంగ్రెస్‌ నివేదిక స్పష్టం చేస్తుంది.logo