గురువారం 22 అక్టోబర్ 2020
National - Aug 05, 2020 , 15:26:02

భారతీయుడి చిరకాల కోరిక తీరింది : సీఎం అమరిందర్‌ సింగ్‌

భారతీయుడి చిరకాల కోరిక తీరింది : సీఎం అమరిందర్‌ సింగ్‌

చండీఘర్‌ : అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి నేడు పునాది రాయి వేయడంతో భారతీయుడి చిరకాల కోరిక తీరినట్లైందని పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరిందర్‌ సింగ్‌ బుధవారం అన్నారు. అమరిందర్‌ సింగ్‌ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. 

‘అయోధ్యలో రామ మందిర్ నిర్మాణానికి చారిత్రాత్మక పునాది వేసినందుకు భారత ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు. రాముడి విశ్వ ధర్మ సందేశం భారతదేశానికి మాత్రమే కాకుండా ప్రపంచానికి మార్గదర్శక కాంతిగా మిగిలిపోయింది’ అని ఆయన ట్వీట్‌ చేశారు. 

ఇదిలా ఉండగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేశారు. అయోధ్యలోని హనుమాన్‌ గార్హి ఆలయాన్ని ప్రధాని మొట్టమొదటి సారిగా నేడు పర్యటించారు. ఇంతే కాకుండా రామ్ జన్మభూమి స్థలాన్ని సందర్శించిన మొదటి ప్రధాని కూడా ఆయనే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo