గురువారం 03 డిసెంబర్ 2020
National - Aug 31, 2020 , 01:56:29

చైనా పక్కలో భారత్‌ బల్లెం

చైనా పక్కలో భారత్‌ బల్లెం

  • దక్షిణచైనా సముద్రంలో భారత యుద్ధనౌక

న్యూఢిల్లీ: జూన్‌లో వాస్తవాధీన రేఖ వెంట గల్వాల్‌లో భారత బలగాలపై చైనా సైన్యం జరిపిన దాడికి ప్రతీకారంగా భారత నేవీ చైనాపైకి దూసుకెళ్లింది. చైనా దూకుడును తిప్పికొట్టేందుకు అత్యాధునిక యుద్ధ నౌకను దక్షిణ చైనా సముద్రంలో మోహరించినట్టు తాజాగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అక్కడే ఉన్న అమెరికా యుద్ధ నౌకలతో భారత నౌక సమన్వయంతో మెలుగుతుండటంతో చైనా సైన్యం వెనక్కు తగ్గినట్టు సమాచారం.  కాగా, తన ఆధీనంలో ఉన్న టిబెట్‌ను శత్రుదుర్బేధ్యమైన కోటగా మార్చాల్సిన అవసరం ఉందని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ అన్నారు. ఈ ప్రాంతంలోని వేర్పాటువాదులను దారికి తెచ్చుకోవటంతోపాటు చైనా సమగ్రత కోసం టిబెట్‌లో సుస్థిరత సాధించటం అత్యవసరమనిసీనియర్‌ నేతలతో సమావేశంలో ఆయన వ్యాఖ్యానించినట్టు ఆ దేశ మీడియా వెల్లడించింది.

55వేల కోట్లతో 6 జలాంతర్గాములు

దేశం చుట్టూ శత్రువుల ప్రమాదం పెరిగిపోతున్న నేపథ్యంలో నౌకాదళాన్ని శక్తిమంతం చేసేందుకు కేంద్రప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. నేవీకి కొత్తగా ఆరు జలాంతర్గాములను నిర్మించి ఇచ్చేందుకు అక్టోబర్‌ నాటికి బిడ్లు ఆహ్వానించనున్నది. ఈ డీల్‌ విలువ రూ.55,000 కోట్లు. మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా వీటిని నిర్మించనున్నారు. ఈ  ప్రాజెక్టుకు పీ-75ఐ అని పేరు పెట్టారు.