సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 09, 2020 , 21:36:19

నేపాల్‌లో భార‌త ఛానెళ్ల నిలిపివేత‌!

నేపాల్‌లో భార‌త ఛానెళ్ల నిలిపివేత‌!

న్యూఢిల్లీ: చైనా చేతిలో కీలుబొమ్మగా మారిన నేపాల్ భారత్‌తో నిత్యం గిల్లీక‌జ్జాలు పెట్టుకుంటూనే ఉన్న‌ది. గురువారం తాజాగా దూర‌ద‌ర్శ‌న్ మిన‌హా మిగ‌తా భారత టీవీ చానెళ్లన్నింటినీ నేపాల్ ప్ర‌భుత్వం నిలిపివేసింది. దూర‌ద‌ర్శ‌న్ మిన‌హా నేపాల్‌లో భార‌త టీవీ ఛానెళ్లన్నింటినీ బంద్ చేస్తున్నట్లు అక్కడి కేబుల్ ఆపరేటర్లు ప్రకటించారు. తాము స్వచ్ఛందంగా ఈ నిర్ణ‌యం తీసుకున్నామని చెప్పారు. 

అయితే, భార‌త టీవీ ఛానెళ్ల నిషేధంపై ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదని, తామే స్వచ్ఛందంగా భార‌త ఛానెళ్ల‌ను నిలిపివేస్తున్నామ‌ని తెలిపారు. భారత టీవీ చానెళ్లలో నేపాల్ వ్య‌తిరేకంగా, నేపాల్‌ ప్రధాని కేపీ శ‌ర్మ‌ ఓలీకి వ్యతిరేకంగా ప్రసారమవుతున్న కార్యక్రమాలను నియంత్రించాలంటూ మాజీ డిప్యూటీ ప్రధాని, అధికార పార్టీ ప్రతినిధి నారాయణ కాజీ శ్రేష్ఠ గురువారం ఉదయం ప్రకటించారు. ఆయన ఈ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే నేపాల్ కేబుల్ ఆపరేటర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo