‘ఫిట్నెస్ ఫ్రీక్’ రకుల్ ప్రీత్ ఈమధ్యే కొవిడ్ నుంచి కోలుకొని ఏక్దమ్ ఫిట్ అనిపించుకుంది. కొవిడ్‌ను ధైర్యంగా ఎదుర్కోవడానికి ఫిట్నెస్ తనకు బాగా ఉపయోగపడిందని చెప్తున్నది. పాజిటివ్ రిపోర్టు వచ్చిన ఐదో రోజు నుంచీ యోగా చేయడం ప్రారంభించింది రకుల్. వ్యాయామం చిన్నప్పటి నుంచీ తన జీవితంలో భాగమని అంటున్నది. రకుల్‌ది మిలిటరీ బ్యాక్‌గ్రౌండ్. చిన్నతనంలోనే జిమ్ అలవాటైంది. కాలేజీ రోజుల్లో తను నేషనల్ గోల్ఫ్ ప్లేయర్ కూడా. ఆ తర్వాత మోడలింగ్ వైపు వచ్చింది. రకుల్ ఇండోర్ కంటే ఔట్‌డోర్ వర్కవుట్స్ ఎక్కువ ఇష్టపడుతుంది. ట్రెక్కింగ్, సైక్లింగ్ ద్వారా ఫిట్‌నెస్‌కు మరింత కనెక్ట్ అవుతానని చెబుతున్నది. సరైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, వాకింగ్, సైక్లింగ్, జిమ్, మంచి అలవాట్లు ఇవన్నీ ఫిట్‌నెస్‌లో భాగమని అంటున్నది. అప్పుడే చక్కని శరీరాకృతినీ, ఆరోగ్యాన్నీ పొందగలమని చెప్తున్నది. కొవిడ్ సోకిన తర్వాత మొదటి ఐదు రోజులు వ్యాయామానికి దూరంగా ఉన్నా.. తర్వాత యోగా, జిమ్ ప్రారంభించానని చెప్తున్నది. 11 రోజుల తర్వాత నెగిటివ్ వచ్చిందనీ, తర్వాత యథావిధిగా పనుల్లో నిమగ్నం అయ్యానని వెల్లడించింది.