సోమవారం 23 నవంబర్ 2020
National - Nov 18, 2020 , 16:36:50

ల‌డాఖ్‌లో వెచ్చ‌ని టెంట్లు.. సైనికులకు ఆధునాత‌న స‌దుపాయాలు

ల‌డాఖ్‌లో వెచ్చ‌ని టెంట్లు.. సైనికులకు ఆధునాత‌న స‌దుపాయాలు

హైద‌రాబాద్:  ఈస్ట్ర‌న్ ల‌డాఖ్‌లో భార‌తీయ సైనిక ద‌ళాల కోసం అప్‌గ్రేడెడ్ స‌దుపాయాల‌ను ఏర్పాటు చేశారు. అతిశీత‌ల వాతావ‌ర‌ణానికి త‌గిన‌ట్లుగా.. అక్క‌డ ఏర్పాట్లు చేస్తున్నారు.  వెచ్చ‌గా ఉండే టెంట్లు.. నిరంత‌ర విద్యుత్తు, నీటి స‌ర‌ఫ‌రా ఉండే విధంగా టెంట్ల‌ను నిర్మించారు.  సైనికుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్ర‌భుత్వం ఈ ఏర్పాట్లు చేస్తోంది. న‌వంబ‌ర్ నెల త‌ర్వాత సుమారు 40 ఫీట్ల హిమ‌పాతం కురిసే ప్రాంతంలో ఈ టెంట్ల‌ను ఏర్పాటు చేస్తున్నారు.  ఈ ప్రాంతాల్లో మైన‌స్ 40 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు కూడా న‌మోదు అవుతుంటాయి. ఇటీవ‌ల చైనాతో స‌రిహ‌ద్దు ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్ని నేప‌థ్యంలో ల‌డాఖ్‌లోని సైనికుల స‌దుపాయాల గురించి నిర్ణ‌యం తీసుకున్నారు.  అయితే శీతాకాలంలో సైనికుల క‌ద‌లిక‌లను చురుకుగా మార్చేందుకు.. ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.