శుక్రవారం 10 జూలై 2020
National - Jun 30, 2020 , 13:36:12

టిక్‌టాక్ బ్యాన్‌తో.. చింగారి యాప్‌కు పెరిగిన క్రేజ్‌

టిక్‌టాక్ బ్యాన్‌తో.. చింగారి యాప్‌కు పెరిగిన క్రేజ్‌

హైద‌రాబాద్‌:  టిక్‌టాక్‌ వీడియో యాప్‌ను భార‌త ప్ర‌భుత్వం బ్యాన్ చేసిన విష‌యం తెలిసిందే.  దీంతో ఇప్పుడు భార‌తీయులు చింగారి వీడియో యాప్ కోసం ఎగ‌బ‌డుతున్నారు.  చైనీస్ టాక్‌టాక్ లాంటి స్వ‌దేశీ చింగారి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు.  ఆ యాప్‌ను దాదాపు ల‌క్ష మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు.  గంట‌కు 20 ల‌క్ష‌ల మంది ఆ యాప్‌ను వీక్షిస్తున్న‌ట్లు తెలుస్తోంది. బెంగుళూరుకు చెందిన ప్రోగ్రామ‌ర్ బిశ్వాత్మ నాయ‌క్‌, సిద్ధార్థ గౌత‌మ్‌లు ఈ యాప్‌ను డెవ‌ల‌ప్ చేశారు.  గ‌త ఏడాది గూగుల్ ప్లే స్లోర్‌లో ఇది ట్రెండింగ్‌లో ఉన్న‌ది. 

పారిశ్రామిక‌వేత్త ఆనంద్ మ‌హేంద్ర .. టిక్‌టాక్ యాప్‌ను వాడ‌లేదని, ఆయ‌న చింగారి యాప్‌ను వాడిన‌ట్లు ట్వీట్ చేశార‌ని బిశ్వాత్మ నాయ‌క్ తెలిపారు.  చింగారి యాప్‌ను సులువుగా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. వీడియోల‌ను కూడా అప్‌లోడ్ చేయ‌వ‌చ్చు.  ఫ్రెండ్స్‌తో చాట్ చేయ‌వ‌చ్చు. షేర్ చేసుకోవ‌చ్చు. వాట్సాప్ స్టేట‌స్‌లో వీడియోలు, ఆడియో క్లిప్స్‌, జిఫ్ స్టిక్క‌ర్స్‌, ఫోటోల‌ను పెట్టుకోవ‌చ్చు. 


logo