మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 14:38:14

కేవీఐసీ నుంచి ఐఆర్‌సీఎస్ 1.80 ల‌క్ష‌ల మాస్కుల కొనుగోలు

కేవీఐసీ నుంచి ఐఆర్‌సీఎస్ 1.80 ల‌క్ష‌ల మాస్కుల కొనుగోలు

ఢిల్లీ : ఇండియ‌న్ రెడ్ క్రాస్ సొసైటీ(ఐఆర్‌సీఎస్‌) నుంచి ఖాదీ అండ్ విలేజ్ ఇండ్ర‌స్ర్టీస్ క‌మిష‌న్‌(కేవీఐసీ) పెద్ద మొత్తంలో ఆర్డ‌ర్‌ను పొందింది. 1.80 ల‌క్ష‌ల కాట‌న్ మాస్కుల కొనుగోలు నిమిత్తం కేవీఐసీకి ఐఆర్‌సీఎస్ ఆర్డ‌ర్ ఇచ్చింది. నివేదిక‌ల ప్ర‌కారం... కేవీఐసీ త‌యారు చేసే మాస్కులు రెడ్ పైపింగ్‌తో బ్రౌన్ క‌ల‌ర్‌తో ఉంటాయి. వంద‌శాతం డ‌బుల్ ట్విస్టెడ్ హాండ్ క్రాఫ్డెడ్ కాట‌న్ ఫ్యాబ్రిక్‌తో త‌యారు చేయ‌బ‌డ‌తాయి. ఇండియ‌న్ రెడ్‌క్రాస్ సొసైటీ కోసం ప్ర‌త్యేకంగా ఈ మాస్కుల‌ను త‌యారు చేస్తుంది. మాస్కుకు కుడి‌వైపు ఐఆర్‌సీఎస్ లోగో ఎడ‌మ‌వైపున‌ కేవీఐసీ లోగో ముద్రించి ఉంటాయి. వచ్చే నెల నాటికి మాస్కుల సరఫరా ప్రారంభమవుతుంది. ఈ మాస్కుల త‌యారీకి 20 వేల మీటర్లకు పైగా ఫాబ్రిక్ అవసరం అవుతుంది. 9 వేల అద‌న‌పు మాన‌వ‌ ప‌నిదినాలు ప‌డుతున్నాయి.

కేవీఐసీ చైర్మ‌న్ విన‌య్ కుమార్ స‌క్సేనా మాట్లాడుతూ... ఇలాంటి ఆర్డ‌ర్లు ఈ కష్ట సమయాల్లో ఖాదీ చేతివృత్తులవారి ఆదాయానికి తోడ్పడతాయన్నారు. ఇప్పటివరకు ఖాదీ ఇండియా 10 లక్షలకు పైగా ఫేస్ మాస్క్‌లను విక్రయించిన‌ట్లు తెలిపారు. ఇందులో డబుల్ లేయర్డ్ కాటన్ మాస్క్‌లు, ట్రిపుల్ లేయర్డ్ సిల్క్ మాస్క్‌లు ఉన్నాయ‌న్నారు. ఇప్ప‌టివ‌ర‌కు తాము జ‌మ్ముక‌శ్మీర్ ప్ర‌భుత్వం నుంచి తాము అతిపెద్ద ఆర్డ‌ర్‌ను అందుకున్న‌ట్లు చెప్పారు. ఆర్డ‌ర్‌పై 7 ల‌క్ష‌ల మాస్కులు స‌కాలంలో పంపిణీ చేసిన‌ట్లు వెల్ల‌డించారు. 

రాష్ట్రపతి భవన్, ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు, కేవీఐసీ ఇ-పోర్టల్ ద్వారా సాధారణ ప్రజల నుండి తాము ఆర్డ‌ర్ల‌ను అందుకున్న‌ట్లు తెలిపారు. భారత రైల్వేకు 20 వేల ఫేస్ మాస్క్‌లను సరఫరా చేసిన‌ట్లు చెప్పారు. ఈ అమ్మకాలతో పాటు దేశవ్యాప్తంగా ఖాదీ సంస్థల ద్వారా కేవీఐసీ దాదాపు 10 లక్షల ఖాదీ మాస్కుల‌ను జిల్లా అధికారులకు ఉచితంగా పంపిణీ చేసిన‌ట్లు పేర్కొన్నారు.logo