ఆదివారం 29 నవంబర్ 2020
National - Nov 19, 2020 , 09:49:25

దేశంలో కొత్త‌గా 45 వేల‌కుపైగా క‌రోనా కేసులు

దేశంలో కొత్త‌గా 45 వేల‌కుపైగా క‌రోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరిగాయి. నిన్న 38 వేల కేసులు న‌మోద‌వ‌గా, గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 45,576 పాజిటివ్ కేసులు రికార్డ‌య్యాయి. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య 89,58,484కు చేరింది. ఇందులో 83,83,603 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకున్నారు. మ‌రో 4,43,303 మంది చికిత్స పొందుతున్నారు. ఇందులో 48,493 మంది బాధితులు కొత్త‌గా డిశ్చార్జీ కాగా, యాక్టివ్ కేసుల్లో నిన్న‌టికంటే 3,502 కేసులు త‌గ్గాయి. కాగా, క‌రోనా వ‌ల్ల గ‌డిచిన 24 గంట‌ల్లో 585 మంది మ‌ర‌ణించ‌డంతో క‌రోనా మృతులు 1,31,578కి పెరిగార‌ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌శాఖ ప్ర‌క‌టించింది. 

పాజిటివ్‌ కేసులు మ‌ళ్లీ పెరుగుతుండ‌టంతో క‌రోనా ప‌రీక్ష‌ల సంఖ్య‌ను కూడా భార‌తీయ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి (ఐసీఎమ్మార్‌) పెంచింది. నిన్న ఒక్క‌రోజే 10,28,203 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని, దీంతో న‌వంబ‌ర్ 18 వ‌ర‌కు క‌రోనా ప‌రీక్ష‌ల సంఖ్య 12,85,08,389కి చేరింద‌ని వెల్ల‌డించింది.