మంగళవారం 26 మే 2020
National - May 10, 2020 , 17:52:04

తొలి తిరుగుబాటు...

తొలి తిరుగుబాటు...

దేశంలో బ్రిటీష్‌ పాలనను వ్యతిరేఖిస్తూ తొలి తిరుగుబాటు ప్రారంభమైంది మే 10 అంటే ఈ రోజే... 1857-58 లో ఉత్తర, మధ్య భారతదేశంలో బ్రిటీషు ఈస్ట్‌ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటును మొదటి భారత స్వాతంత్య్ర సంగ్రామం అంటారు. ఈ తిరుగుబాటు వైఫల్యం చెందినా దేశంలో స్వాతంత్య్రం కోసం ప్రజల్లో బలమైన ఆలోచన వచ్చింది. 1857 మే 10 న మీరట్‌లో సిపాయీలతో మొదలైన తిరుగుబాటు, ఉత్తర గంగా మైదానంలోను, మధ్య భారతంలోనూ పౌర తిరుగుబాటుగా మారింది. తూర్పు భారత దేశంలో కూడా తిరుగుబాటు ఘటనలు జరిగాయి. ఈ తిరుగుబాటు ఆ ప్రాంతాల్లో బ్రిటీషు వారి అధికారాన్ని పెద్దయెత్తున సవాలు చేసింది. 1858 జూన్‌ 20 న తిరుగుబాటుదార్లను ఓడించడంతో ఇది ముగిసింది.


అయితే ఈ తిరుగుబాటులో చాలామంది భారతీయులు పాల్గొనలేదు. కొంతమంది బ్రిటీషు వారికి మద్దతుగా పోరాడారు కూడా. తిరుగుబాటుదార్లు బ్రిటీషు వారిపైన, వారి స్త్రీలు పిల్లలపైన హింసాకాండ జరపగా, బ్రిటీషు వారు గ్రామాలకు గ్రామాలనే తగలబెట్టారు. ఢిలీ, లక్నో నగరాలను ధ్వంసం చేసారు. మీరట్‌లో తిరుగుబాటు మొదలయ్యాక, తిరుగుబాటుదార్లు వెంటనే ఢిల్లీ చేరుకుని చివరి మొగల్‌ చక్రవర్తి బహదూర్‌ షా జాఫర్‌ను తిరుగుబాటుకు నాయకుడిగా, భారతదేశ చక్రవర్తిగా ప్రకటించారు. అప్పటికి అతడి వయసు 80 ఏళ్లు దాటింది. పెద్ద సంస్థానాలైన హైదరాబాదు, మైసూరు, తిరువాన్కూరు, కాశ్మీరులతో పాటు చిన్న సంస్థానాలు కూడా ఈ తిరుగుబాటులో పాల్గొనలేదు. 


కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా అవధ్‌లో, ఈ తిరుగుబాటు బ్రిటీషు పాలనకు వ్యతిరేకంగా చేస్తున్న దేశభక్తి యుత పోరాటంగా రూపుదాల్చింది. భారతదేశ - బ్రిటీషు సామ్రాజ్యాల చరిత్రలో ఈ తిరుగుబాటు ఒక ముఖ్యమైన మలుపు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ రద్దుకు, భారతీయ సైన్యం, ఆర్థిక వ్యవస్థ, భారతీయ పరిపాలనా వ్యవస్థలను బ్రిటీషు వారు గుర్తించేందుకూ, 1858 నాటి భారత ప్రభుత్వ చట్టం చేసేందుకూ దారితీసింది. భారతీయులకు బ్రిటీషు వలస రాజ్యాల పౌరులకు ఉండే హక్కులను ఇస్తూ 1858 నవంబరు 1 న విక్టోరియా రాణి ఒక ప్రకటన చేసింది. దీంతో భారతీయులకు అప్పటికి స్వాతంత్య్రం రాకపోయినా కొన్ని హక్కులు అయితే వచ్చాయి.


logo