ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 13:02:39

బ‌రేలీ టు బెనాపోల్‌కు 51 స‌రుకు ర‌వాణా ట్ర‌క్కులు

బ‌రేలీ టు బెనాపోల్‌కు 51 స‌రుకు ర‌వాణా ట్ర‌క్కులు

ఢిల్లీ : ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బ‌రేలీ నుంచి బంగ్లాదేశ్‌లోని బెనాపోల్‌కు 51 స‌రుకు ర‌వాణా ట్ర‌క్కులు బ‌య‌ల్దేరాయి. ఈ ట్రక్కుల‌ను భార‌తీయ రైల్వే చేర‌వేస్తున్న‌ట్లు ఇండియ‌న్‌ హైక‌మిష‌న్ తెలిపింది. భార‌త్‌-బంగ్లాదేశ్ ఆర్థిక అభివృద్ధిలో భాగంగా టాటా మోటార్స్‌కు చెందిన 51 టాటా ఏస్ స‌రుకు ర‌వాణా వాహ‌నాల‌ను భార‌తీయ రైల్వే మొద‌టిసారిగా బంగ్లాదేశ్‌కు చేర‌వేస్తుంది. ఈ వాహ‌నాలు బ‌రేలీ నుంచి మొత్తం 1407 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించి బెనాపోల్‌కు చేరుకోనున్నాయి.

ఎగుమ‌తుల‌ను ప్రోత్స‌హించేందుకు భార‌తీయ రైల్వే ఎల్ల‌ప్పుడూ ముందు వ‌రుస‌లో ఉంటుంద‌ని కేంద్ర‌మంత్రి పియూష్ గోయ‌ల్ పేర్కొన్నారు. పెట్రాపోల్-బెనాపోల్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ భారతదేశం-బంగ్లాదేశ్ ద్వైపాక్షిక వాణిజ్యంలో దాదాపు మూడవ వంతు (8.7 బిలియన్ డాలర్లు) భాగాన్ని క‌లిగిఉంది. కోవిడ్ సంబంధిత స‌మ‌స్య‌ల అనంత‌రం ఈ నెల ప్రారంభం నుంచి ఇది రెండు వైపులా పూర్తిగా ప‌నిచేస్తోంది.


logo