శనివారం 27 ఫిబ్రవరి 2021
National - Jan 24, 2021 , 19:23:37

ఫేక్‌న్యూస్ న‌మ్మొద్దు: రైళ్ల ప్రారంభంపై కేంద్రం

ఫేక్‌న్యూస్ న‌మ్మొద్దు: రైళ్ల ప్రారంభంపై కేంద్రం

న్యూఢిల్లీ: ‌రైల్వే ప్ర‌యాణికుల్లారా! అప్ర‌మ‌త్తంగా ఉండండి!! అని కేంద్ర ప్ర‌భుత్వం హెచ్చ‌రించింది. భార‌తీయ రైల్వే బోర్డు వ‌చ్చేనెల ఒక‌టో తేదీ నుంచి సాధార‌ణ రైలు స‌ర్వీసులు పునఃప్రారంభం కానున్నాయ‌న్న మార్ప్‌డ్ ఇమేజ్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది. కోవిడ్ కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్న నేప‌థ్యంలో సాధార‌ణ రైలు స‌ర్వీసులు ప్రారంభం అవుతాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. కానీ ఈ అంచ‌నాల‌ను, ఫేక్ న్యూస్‌ను కేంద్ర ప్ర‌భుత్వం తోసిపుచ్చింది. ఫిబ్ర‌వ‌రి ఒక‌టో తేదీ నుంచి సాధార‌ణ రైలు స‌ర్వీసులు పునఃప్రారంభం అవుతాయ‌ని సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న ఇమేజ్.. న‌కిలీ న్యూస్ అని పేర్కొంది. 

ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితిని ప‌ర్య‌వేక్షిస్తున్నామ‌ని, వివిధ మంత్రిత్వ‌శాఖ‌లతో చ‌ర్చించిన త‌ర్వాత సాధార‌ణ రైలు స‌ర్వీసుల పున‌రుద్ధ‌ర‌ణ‌పై నిర్న‌యం తీసుకుంటామ‌ని రైల్వే అధికారులు త‌రుచుగా చెబుతున్నారు. ఇటీవ‌ల ప్రెస్ ఇన్ఫ‌ర్మేష‌న్ బ్యూరో (పీఐబీ) కూడా ఫిబ్ర‌వ‌రి ఒక‌టో తేదీ నుంచి రైలు స‌ర్వీసులు పునః ప్రారంభం అవుతాయ‌న్న న‌కిలీ వార్త‌ల‌ను కొట్టిపారేసింది.క‌రోనా స‌మ‌యంలోనూ ప్ర‌త్యేక రైలు స‌ర్వీసుల‌ను న‌డిపిన భార‌తీయ రైల్వే.. మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేయ‌డానికి గ‌తేడాది మార్చి నుంచి సాధార‌ణ రైలు స‌ర్వీసుల‌ను నిలిపివేసిన సంగ‌తి తెలిసిందే. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo