మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 06:54:21

2023లో ప్రైవేటు రైలు కూత

2023లో ప్రైవేటు రైలు కూత

న్యూఢిల్లీ: ప్రయాణికుల రైళ్లను ప్రైవేటు సంస్థలు నిర్వహించే అంశంలో రైల్వే శాఖ కీలక ప్రణాళికలను సిద్ధం చేస్తున్నది. 2023 నాటికి తొలి విడుతలో 12 ప్రైవేటు రైళ్లను అందుబాటులోకి తీసుకురావడానికి కసరత్తు చేస్తున్నది. ఆ తర్వాత ఏడాది మరో 45 రైళ్లను తీసుకువచ్చే యోచనలో ఉన్నట్టు ఆ శాఖ అధికారులు తెలిపారు. ఇలా 2027 నాటికి మొత్తం 151 ప్రైవేటు సర్వీసులను పట్టాలెక్కించేందుకు ప్రయత్నిస్తున్నట్టు పేర్కొన్నారు. ‘మార్చి 2023 నుంచి ప్రైవేటు రైళ్లు ప్రారంభమవుతాయి. 2022-23లో 12 రైళ్లు, 2023-24లో 45, 2025-26లో 50, 2026-27లో 44 రైళ్లను తీసుకురానున్నాం. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ రైళ్లలోని 70 శాతం భాగాలు భారత్‌లోనే తయారు అవుతాయి’ అని అధికారి ఒకరు తెలిపారు.  


logo