కొత్త డిజైన్‌లో విస్టాడోమ్ రైలు కోచ్‌లు.. స్పీడ్ ట్రయల్ సక్సెస్

హైదరాబాద్: భారతీయ రైల్వే శాఖ విస్టాడోమ్ టూరిస్టు కోచ్‌లకు సంబంధించిన స్పీడ్ ట్రయల్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఆ కొత్త డిజైన్ విస్టాడోమ్ కోచ్‌లు గంటకు సుమారు 180 కిలోమీటర్ల వేగాన్ని తట్టుకునే విధంగా రూపొందించారు. ఇలాంటి కోచ్‌ల్లో ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ఓ మరుపురాని జ్ఞాపకంగా మార్చుకోనున్నట్లు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తన ట్వీట్లో తెలిపారు. టూరిజం అభివృద్ధికి కూడా విస్టాడోమ్ కోచ్‌లు సహకరించినున్నట్లు ఆయన తెలిపారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాకటరీ (ఐసీఎఫ్) ఆ కొత్త తరహా కోచ్‌లను నిర్మించింది. అయితే ఈ కోచ్‌లకు చెందిన స్క్వీజ్ టెస్ట్‌ను ఇటీవలే పూర్తి చేశారు.
44 సీట్లు.. 180 డిగ్రీల రొటేషన్
విస్టాడోమ్ కోచ్‌ల్లో భారీ స్థాయిలో గ్లాస్ విండోలు ఉంటాయి. గ్లాస్ రూఫ్‌తో పాటు అబ్జర్వేషన్ లాంజ్, రూట్ టేబుల్ సీట్లను ఏర్పాటు చేశారు. అద్భుతమైన ప్రకృతి అందాలను ఆ కోచ్‌ల నుంచి తిలకించే విధంగా వాటిని రూపొందించారు. ప్రయాణికులు తాము వెళ్లే రూట్‌కు సంబంధించిన లొకేషన్లను ఈ కోచ్‌ల ద్వారా తిలకించే వీలు ఉంటుంది. ఒక్కొక్క విస్టాడోమ్ కోచ్‌లో 44 సీట్లు ఉంటాయి. ప్రతి సీటు 180 డిగ్రీలు తిరిగే విధంగా ఏర్పాటు చేశారు. వైఫై ఆధారిత ప్యాసింజెర్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థ ఉంటుంది. కోచ్‌లో ఉన్న గ్లాస్ షీట్లను లామినేట్ చేశారు. కేవలం ప్రకృతి అందాలను తిలకించే ప్రదేశాల్లో మాత్రమే ఈ కొత్త డిజైన్ విస్టాడోమ్ కోచ్‌లను వాడనున్నారు.
ఇవే ఆ రూట్లు..
విస్టాడోమ్ కొత్త డిజైన్ కోచ్‌లను వినియోగించే రూట్లను కూడా రైల్వే శాఖ ప్రకటించింది. దాదర్-మడగావ్, అరకు లోయ, కశ్మీర్ లోయ, డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, కల్కా షిమ్లా రైల్వే, కంగ్రా వ్యాలీ రైల్వే, మాథేరన్ హిల్ రైల్వే, నీలగిరి మౌంటేన్ రైల్వే ప్రాంతాల్లో విస్టాడోమ్ కోచ్‌లను నడపనున్నారు.
తాజావార్తలు
- వరుణ్ తేజ్ మూవీకి ఆసక్తికరమైన టైటిల్.. ఫస్ట్ లుక్ విడుదల
- కాళేశ్వరం పర్యటనకు బయల్దేరిన సీఎం కేసీఆర్
- కావాల్సినవి 145 పరుగులు.. చేతిలో 7 వికెట్లు
- కరోనాతో సీపీఎం ఎమ్మెల్యే మృతి
- వ్యాక్సిన్ పంపిణీపై డబ్ల్యూహెచ్‌వో అసంతృప్తి
- వీడియో : అదిరింది..మోగింది
- చైనా వ్యాక్సిన్‌కు పాకిస్థాన్ గ్రీన్ సిగ్నల్
- కమల్ ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన శృతి, అక్షర
- బైక్‌పై 4500 కి.మీల భారీయాత్రకు సిద్దమైన స్టార్ హీరో
- సూరత్ ప్రమాదం.. ప్రధాని, రాజస్థాన్ సీఎం సంతాపం