సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 06, 2020 , 17:25:50

బీనలో 1.7మెగావాట్లతో రైల్వే సోలార్‌ పవర్‌ ప్లాంట్‌

బీనలో 1.7మెగావాట్లతో రైల్వే సోలార్‌ పవర్‌ ప్లాంట్‌

బీన : కాలుష్య నియంత్రణలో భారత రైల్వే ఓ అడుగు ముందుకేసింది. మధ్యప్రదేశ్‌ బీనలో 1.7 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను రైళ్లను నడిపేందుకు వినియోగించనున్నారు. మెగా సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ రెండు వారాల్లో అందుబాటులోకి రానుండగా,  ఏటా రూ.1.37 కోట్లు ఆదా కానున్నాయి. పైలట్‌ ప్రాజెక్టుగా ప్లాంట్‌ను ఏర్పాటు చేయగా, ఇప్పటికే ట్రయల్‌ పనులు కొనసాగుతున్నాయి. బీన శివారులోని రైల్వేకు చెందిన భూమిలో భారత్‌ హెవీ ఎలక్ట్రికల్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్‌) సహకారంతో ఈ సోలార్ పవర్ ప్లాంట్‌ను నిర్మిస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల ద్వారా 25వేల వోల్టులకు ప్లాంట్‌ను పెంచనున్నారు. ప్లాంట్ నుంచి ఫీడర్‌ 25కేవీ రైల్వే ఓవర్ హెడ్‌లైన్‌తో అనుసంధానం చేశారు.

గతేడాది నవంబర్‌లో ప్రాజెక్టును ప్రారంభించగా, జూన్‌లో పనులు పూర్తి కాగా, టెస్టింగ్‌ పనులు ప్రారంభించారు. ప్లాంట్‌ డిజైన్‌ బీహెచ్‌ఈఎల్‌ ఇంజినీర్ల ఆధ్వర్యంలో రూపొందించారు. కాగా, దేశవ్యాప్తంగా సంస్థకు చెందిన ఖాళీ భూముల్లో సోలార్‌ పవర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ఇండియన్‌ రైల్వే యోచిస్తున్నది. 2030 నాటికి 'నికర జీరో' కార్బన్ ఎమిషన్ మాస్ ట్రాన్స్ పోర్టేషన్ నెట్‌వర్క్‌గా రూపాంతరం చెందేందుకు రైల్వే లక్ష్యంగా నిర్దేశించుకుంది. సోలార్ ఎనర్జీని వినియోగించడం ద్వారా భారతీయ రైల్వే ఇంధన స్వయం సమృద్ధి కలిగిన మొట్టమొదటి రవాణా సంస్థగా నిలువనుంది.లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo