బుధవారం 03 జూన్ 2020
National - Mar 31, 2020 , 16:06:43

ఐసోలేషన్‌ కేంద్రాలుగా 20 వేల రైల్వే కోచ్‌లు

ఐసోలేషన్‌ కేంద్రాలుగా 20 వేల రైల్వే కోచ్‌లు

సికింద్రాబాద్‌ : కోవిడ్‌-19పై పోరాటానికి ఇండియన్‌ రైల్వే తన వంతు చేయూతను అందిస్తుంది. మొత్తం 3.2 లక్షల పడకల సామర్థ్యంతో 20 వేల కోచ్‌లను ఐసోలేషన్‌ కేంద్రాలుగా మార్చేందుకు రైల్వే సిద్ధమైంది. ఒక కోచ్‌లో 16 బెడ్స్‌ ఏర్పాటు. నాన్‌ ఏసీ స్లీపర్‌ కోచ్‌లను క్వారంటైన్‌కు, ఐసోలేషన్‌ కోచ్‌లుగా మార్చుతున్నారు. ప్రాథమికంగా 80 వేల పడకలతో 5 వేల కోచ్‌లను సిద్ధంచేశారు. రైల్వే జోన్లవారిగా ఐసోలేషన్‌ కోచ్‌ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 

సెంట్రల్‌ రైల్వే జోన్‌ పరిధిలో-482, ఈస్ట్రన్‌ రైల్వేలో-338, ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే-208, ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే-261, నార్తరన్‌ రైల్వే-370, నార్త్‌ సెంట్రల్‌ రైల్వే-290, నార్త్‌ ఈస్ట్రన్‌ రైల్వే-216, నార్త్‌ఈస్ట్‌ ఫ్రంటీర్‌ రైల్వే-315, నార్త్‌ వెస్ట్రన్‌ రైల్వే-266, సౌత్రన్‌ రైల్వే-473, సౌత్‌ సెంట్రల్‌ రైల్వే-486, సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే-329, సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే-111, సౌత్‌ వెస్ట్రన్‌ రైల్వే-312, వెస్ట్రన్‌ రైల్వే-410 వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వే జోన్‌ పరిధిలో 133 క్వారంటైన్‌, ఐసోలేషన్‌ కోచ్‌లు ఏర్పాటు కానున్నాయి.


logo