గురువారం 24 సెప్టెంబర్ 2020
National - Aug 06, 2020 , 20:18:13

శుక్రవారం పట్టాలెక్కనున్న తొలి ‘కిసాన్‌ రైలు’

శుక్రవారం పట్టాలెక్కనున్న తొలి ‘కిసాన్‌ రైలు’

ముంబై: భారత రైల్వే మరో చరిత్ర సృష్టించబోతున్నది. రైతుల కోసం ప్రవేశపెడుతున్న తొలి ‘కిసాన్‌ రైలు’ శుక్రవారం పట్టాలెక్కనున్నది. మహారాష్ట్రలోని దేవ్లాలి నుంచి బీహార్‌లోని దానపూర్‌ వరకు నడిచే తొలి కిసాన్‌ రైలుకు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైల్వే మంత్రి పియూష్ గోయల్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా పచ్చజెండా ఊపనున్నారు. ఈ రైలు వారానికి ఒకసారి నడుస్తుంది. ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు దేవ్లాలిలో బయలుదేరి శనివారం సాయంత్రం 6.45కి దానాపూర్‌ చేరుతుంది. 1,519 కిలోమీటర్ల దూరాన్ని 32 గంటల్లో పూర్తి చేస్తుంది. త్వరగా పాడైపోయే పాలు, మాంసం, కూరగాయలు, వ్యవసాయ ఉత్పత్తులను వేగవంతంగా రవాణా చేసేందుకు కిసాన్‌ రైళ్లను రైల్వే శాఖ నడపనున్నది. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు కావాలన్న లక్ష్యం మేరకు కిసాన్‌ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు 2020-21 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.


logo