సోమవారం 25 జనవరి 2021
National - Dec 18, 2020 , 17:34:17

ప్యాసెంజ‌ర్ రైళ్ల ర‌ద్దు.. ఇండియ‌న్ రైల్వేస్‌కు భారీ న‌ష్టం

ప్యాసెంజ‌ర్ రైళ్ల ర‌ద్దు.. ఇండియ‌న్ రైల్వేస్‌కు భారీ న‌ష్టం

న్యూఢిల్లీ: క‌రోనా కార‌ణంగా ప్యాసెంజ‌ర్ రైళ్ల‌ను ర‌ద్దు చేయ‌డంతో ఇండియ‌న్ రైల్వేస్‌కు భారీ న‌ష్టం వాటిల్లింది. ఈ ఏడాది ఆదాయం ఏకంగా 87 శాతం త‌గ్గింది. గ‌తేడాది ప్యాసెంజ‌ర్ రైళ్ల కార‌ణంగా ఇండియ‌న్ రైల్వేస్‌కు రూ.53 వేల కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడాది అది రూ.4600 కోట్లకు ప‌రిమిత‌మైంది. అయితే ఈ న‌ష్టాన్ని పెరిగిన స‌రుకు ర‌వాణాతో భ‌ర్తీ చేయ‌వ‌చ్చ‌ని రైల్వేస్ భావిస్తోంది. రైల్వేస్ త‌న నిర్వ‌హ‌ణ ఖ‌ర్చును సొంత ఆదాయం ద్వారానే స‌మ‌కూర్చుకోవాల‌న్న ల‌క్ష్యంతో ఇండియ‌న్ రైల్వేస్ ప‌ని చేస్తున్న‌ట్లు రైల్వే బోర్డు చైర్మ‌న్ వినోద్ కుమార్ యాద‌వ్ చెప్పారు. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతున్న స‌రుకుల ర‌వాణాలో ఇండియ‌న్ రైల్వేస్ వాటా 27 శాతంగా ఉన్న‌ద‌ని, 2030 క‌ల్లా దీనిని 45 శాతానికి పెంచాల‌ని భావిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.


logo